సిద్ధి వినాయక ఆలయానికి ఐపీఎల్ టైటిల్ ట్రోఫీ

Mon,May 22, 2017 02:21 PM

IPL trophy taken to Shree Siddhivinayak Ganapati temple


మహారాష్ట్ర: ముంబై ఇండియన్స్ టీం ఐపీఎల్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు సాధించిన ఐపీఎల్ సీజన్-10 టైటిల్ ట్రోఫీని అధికారులు మహారాష్ట్రలోని సిద్ధివినాయక ఆలయానికి తీసుకెళ్లారు. అధికారుల బృందం ఐపీఎల్ టైటిల్ ట్రోఫీని గణనాథుని ఆశీస్సుల కోసం ఆలయంలోకి తీసుకెళ్లింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ టీం, పుణే జట్టుపై తిరుగులేని విజయాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles