సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం 199 పరుగులు

Fri,March 29, 2019 10:08 PM

IPL: Rajasthan Royals 198/2

హైదరాబాద్: ఉప్పల్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు చెలరేగిపోయి పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సంజు సామ్సన్ సెంచరీతో చెలరేగిపోయాడు. 55 బంతుల్లో నాలుగు సిక్సులు, 10 ఫోర్లతో 102 పరుగులు సాధించాడు. అజింక్య రహానె 70 పరుగులు(49 బంతుల్లో 3 సిక్స్‌లు, 4 ఫోర్లు). బట్లర్ 5 పరుగులు, బెన్ స్టోక్స్ 16 పరుగులు చేశారు. రషీద్ ఖాన్, నదీమ్ చెరో వికెట్ తీశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం 199 పరుగులు.

1843
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles