ఐపీఎల్ ఫైన‌ల్‌.. ఉప్ప‌ల్ స్టేడియంలోనే

Mon,April 22, 2019 06:06 PM

హైద‌రాబాద్: ఈ ఏడాది ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌కు.. ఉప్ప‌ల్ స్టేడియం వేదిక కానున్న‌ది. మే 12వ తేదీన ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో మ్యాచ్ జ‌రుగుతుంది. చెన్నైలో మొద‌టి క్వాలిఫ‌య‌ర్‌, విశాఖ‌ప‌ట్ట‌ణంలో ఎలిమినేట‌ర్‌తో పాటు క్వాలిఫ‌య‌ర్ 2 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 11 ఐపీఎల్ సీజ‌న్స్ ముగిశాయి. ఇప్పుడు 12వ‌ సీజ‌న్ జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం చెన్నై సూప‌ర్ కింగ్స్ టైటిల్ హోల్డ‌ర్‌గా ఉంది. ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఈ టోర్నీని మూడేసి సార్లు గెలుచుకున్నాయి.

2643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles