వచ్చే ఏడాది ఐపీఎల్ ఎక్కడంటే..!

Thu,April 26, 2018 11:07 AM

IPL 2019 Could be Moved to UAE Due to General Elections

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) టోర్నీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2019 సీజన్‌ను భారత్‌లో కాకుండా వేరే దేశంలో నిర్వహించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్, ఐపీఎల్ టోర్నీ షెడ్యూల్ ఒకే సమయంలో ఉంటే భారత్ ఆవల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారులు తెలిపారు.

దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టోర్నీ నిర్వహించేందుకు అవకాశమున్న వేదికల్లో యూఏఈ కూడా ఒకటి. అన్ని ఫ్రాంఛైజీల అభిప్రాయం తీసుకున్న తరువాతనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఒక వేళ టోర్నీ జరగడానికి ముందే ఎన్నికలు ముగిస్తే ఐపీఎల్ 12వ ఎడిషన్ స్వదేశంలోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు 2014లో కూడా యూఏఈ వేదికగా ఐపీఎల్‌ను నిర్వహించారు.

3635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles