ఐపీఎల్-11: ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదికలు మార్పు

Fri,May 4, 2018 03:14 PM

IPL 2018 Eliminator and Qualifier 2 Shifted to Kolkata From Pune

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ప్లే ఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సిన వేదికల్లో తాజాగా మార్పులు చోటుచేసుకున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు పుణె మైదానం ఆతిథ్యమివ్వాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌లకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుందని ఐపీఎల్ పాలకమండలి శుక్రవారం వెల్లడించింది. మే 23, 25 తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.

పుణె స్టేడియం కన్నా చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండటమే దీనికి ఒక కారణమని తెలుస్తోంది. ఈడెన్‌లో 67వేల మంది అభిమానులు మ్యాచ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంది. క్వాలిఫయర్ 1 యథావిధిగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలోనే మే 22న జరగనుంది. మే 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు కూడా ఇదే స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సొంతమైదానంగా పుణెలో మ్యాచ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే.

3150
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles