టీమిండియాకు భారీ షాక్.. వ‌ర‌ల్డ్ క‌ప్‌ నుంచి ధావ‌న్‌ ఔట్

Tue,June 11, 2019 01:55 PM

Injured Shikhar Dhawan ruled out of World Cup 2019 for 3 weeks

నాటింగ్‌హామ్: వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ. సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్ వరల్డ్ కప్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. గాయమైన అతని వేలికి స్కానింగ్ తీయగా ఫ్రాక్చర్ అయిందని తేలింది. గాయం తీవ్రత దృష్ట్యా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో అతడు సుమారు మూడు వారాల పాటు టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. రోహిత్ శ‌ర్మ‌తో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా బ‌రిలో దిగ‌నున్నాడు.

భారత్ తన తర్వాతి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌లతో తలపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అతడు జట్టులో లేని లోటు భారత్ విజయావకాశాలపై పడనుంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో కీలక మ్యాచ్‌కు ముందు కోహ్లీసేనకు ఆందోళన కలిగించే అంశం ఇది. ఆసీస్‌తో మ్యాచ్‌లో గబ్బర్ 117 పరుగులతో రాణించడంతో 36 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ధావన్ స్థానాన్ని శ్రేయాస్ అయ్యర్ లేదా రిషబ్ పంత్‌తో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి ధావన్ బొటన వేలికి బలంగా తాకింది. ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ కొనసాగించాడు. ఫీల్డింగ్‌కు ధావన్ స్థానంలో జడేజా వచ్చిన సంగతి తెలిసిందే.

16983
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles