229 కొడితే.. వ‌ర‌ల్డ్‌క‌ప్ మ‌న‌దే

Sun,July 23, 2017 06:23 PM

Indian Eves need 229 runs to win their first ever World Cup

లండ‌న్‌: మ‌హిళ‌ల క్రికెట్‌లో ఇండియా తొలిసారి విశ్వ‌విజేత‌గా నిలిచి చ‌రిత్ర సృష్టించ‌డానికి 229 ప‌రుగులు చేయాల్సి ఉంది. లార్డ్స్‌లో జ‌రుగుతున్న ఫైన‌ల్లో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను భార‌త బౌల‌ర్లు క‌ట్ట‌డి చేశారు. దీంతో ఆతిథ్య జ‌ట్టు 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 228 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. పేస్ బౌల‌ర్ ఝుల‌న్ గోస్వామి 3 వికెట్లు తీసి.. ఇంగ్లండ్‌ను దెబ్బ తీసింది. ఓపెన‌ర్లు విన్‌ఫీల్డ్ (24), బ్యూమాంట్ (23) తొలి వికెట్‌కు 47 ప‌రుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే స్పిన్న‌ర్లు రాజేశ్వ‌రి, పూన‌మ్ యాద‌వ్‌.. వెంట‌వెంట‌నే వికెట్లు తీయ‌డంతో ఇంగ్లండ్ 63 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ ద‌శలో టేల‌ర్ (45), సివ‌ర్ (51) నాలుగో వికెట్‌కు 83 ప‌రుగులు జోడించారు. దీంతో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా సాగుతున్న‌ట్లు క‌నిపించింది.


అయితే కీల‌క‌మైన ఈ స‌మ‌యంలో మిథాలీ ఎత్తుగ‌డ ఫ‌లించింది. పేస్ బౌల‌ర్ ఝుల‌న్ గోస్వామిని ఆమె రంగంలోకి దించింది. ఝుల‌న్ వీళ్ల భాగ‌స్వామ్యానికి తెర‌దించ‌డంతోపాటు ఒకే ఓవ‌ర్ రెండు వ‌రుస బంతుల్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. కీల‌క‌మైన టేల‌ర్ (45), సివ‌ర్ (51) వికెట్ల‌తోపాటు విల్స‌న్ (0)నూ పెవిలియన్‌కు పంపించింది. ఆమె త‌న ప‌ది ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 23 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. అటు స్పిన్న‌ర్ పూన‌మ్ యాద‌వ్ 2 వికెట్లు తీయ‌గా.. రాజేశ్వ‌రి ఒక వికెట్ తీసింది. బ్రంట్ (34) ర‌నౌటైంది. చివ‌ర్లో గ‌న్ (25 నాటౌట్‌), మార్ష్(14 నాటౌట్‌) ఇంగ్లండ్‌కు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు అందించారు.

1440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles