కోహ్లి vs బుమ్రా, ధోనీ vs పంత్.. సై అంటే సై అంటున్న టీమిండియా క్రికెటర్లు

Thu,February 28, 2019 04:34 PM

Indian cricketers in War of words in IPL promos

ముంబై: ప్రత్యర్థులతో తలపడాల్సిన టీమిండియా క్రికెటర్లు వాళ్లలో వాళ్లే సవాళ్లు విసురుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. సీనియర్ క్రికెటర్లు అని కూడా చూడకుండా.. జూనియర్లు నువ్వెంత అంటున్నారు. నాకే సవాలు విసురుతావా.. చూసుకుంటా అంటూ సీనియర్లు దూకుడుగా సమాధానం ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. 12వ ఎడిషన్ ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం. మార్చి 23 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ టీమిండియా క్రికెటర్లతో ఆసక్తికరమైన ప్రొమోలు సిద్ధం చేసింది. కెప్టెన్ అని కూడా చూడకుండా నాకే సవాలు విసురుతావా అంటూ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాపై విరాట్ కోహ్లి మండిపడటం.. గురువు అంటూనే నా సంగతి చూస్తా అంటావా అంటూ రిషబ్ పంత్‌ను ధోనీ సుతిమెత్తగా మందలిస్తున్నట్లు ఈ ప్రోమోలను చిత్రీకరించారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ వీడియోలు వైరల్‌గా మారిపోయాయి. వరల్డ్ బెస్ట్ బౌలరా? ఇంకా లేదు కానీ.. ఇప్పటికైతే బెస్ట్ బ్యాట్స్‌మన్ పని పట్టాల్సిన సమయం వచ్చింది.. చీకూ భయ్యా వస్తున్నా అంటూ బుమ్రాపై ఓ ప్రోమో చిత్రీకరించారు. ఇలాగే అటు పంత్, ధోనీలపైనా వచ్చిన మరో ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటున్నది.

4214
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles