టీమిండియా జాంటీ రోడ్స్ క్రికెట్‌కు వీడ్కోలు: వీడియో

Fri,July 13, 2018 04:40 PM

న్యూఢిల్లీ: క్రికెట్ మైదానంలో ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు డైవ్‌లతో క్యాచ్‌లు పట్టడాన్ని చాలా సార్లు చూస్తూనే ఉన్నాం. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫీల్డర్ అంటే మొదట గుర్తొచ్చేది సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్. భారత క్రికెట్లో చిరుతలా కదిలే సీనియర్ ఆటగాడు మహ్మద్ కైఫ్‌ను ఇండియన్ జాంటీ రోడ్స్ అని పిలుస్తుంటారు. తన క్రికెట్ కెరీర్‌లో తన స్టన్నింగ్ క్యాచ్‌లతో క్రీడాభిమానులను ఎంతో అలరించాడు. గాల్లోకి ఎగిరిన బంతిని పక్షుల్లా ఎగిరి అందుకొని అతడు చేసిన విన్యాసాలు అబ్బురపరుస్తాయి.


లోయర్ ఆర్డర్‌లో

సుధీర్ఘకాలం టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన కైఫ్ శుక్రవారం అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్‌కు చివరిసారిగా ఆడిన 12ఏళ్ల తరువాత వీడ్కోలు చెప్పడం గమనార్హం. లోయర్ ఆర్డర్‌లో తన బ్యాటింగ్‌తో జట్టును ఎన్నోసార్లు ఆదుకున్నాడు. తన కెరీర్‌లో గొప్పగా చెప్పుకునే ప్రదర్శన చేసింది కూడా ఈరోజే కావడం విశేషం. సహచర ఆటగాడు యువరాజ్‌సింగ్‌తో కలిసి కైఫ్(87) నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 37ఏళ్ల కైఫ్ 13 టెస్టులు, 125 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు.

క్రికెట్ కెరీర్..

13 టెస్టుల్లో 624 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 148. అందులో ఒక సెంచరీ, మూడు అర్ధశతకాలు ఉన్నాయి.
125 వన్డేల్లో కైఫ్ 2753 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 111. రెండు సెంచరీలు, 17 అర్ధశతకాలు సాధించాడు.
ఐపీఎల్‌లో 29 మ్యాచ్‌ల్లో 259 పరుగులు చేయగా.. బెస్ట్ స్కోరు 34 మాత్రమే.

ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటర్మైంట్ ప్రకటిస్తున్నానని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరికి ఈ-మెయిల్‌లో పేర్కొన్నాడు.5867
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles