భారత క్రికెటర్ల 'చిల్డ్రన్స్ డే' సెలబ్రేషన్స్:వీడియోలు

Wed,November 14, 2018 04:58 PM

Indian Captain Virat Kohli Celebrates Childrens Day in Unique Style

ముంబయి: భారత ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈరోజు పాఠశాలల్లో ఆటలు, పాటల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులు అందజేస్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో చిన్నారులు నెహ్రూ వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత క్రికెటర్లు పిల్లలకు చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంతమంది పిల్లలతో సరదాగా ముచ్చటించాడు. వారితో ఫొటోలకు పోజులిచ్చాడు. అభిమానులకు విషెస్ చెబుతూ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. విరాట్ ఒక్కడే కాదు శిఖర్ ధావన్, ఆజింక్య రహానె, వీవీఎస్ లక్ష్మణ్, హార్దిక్ పాండ్య, పుజారా తదితరులు చిన్నారులతో సందడి చేసిన ఫొటోలను ఫాలోవర్లతో పంచుకున్నారు.


1067
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles