టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Mon,March 12, 2018 08:21 PM

India won toss and elected fielding in Colombo t20

కొలంబో: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం అవడంతో ఇరు వైపులా 1 ఓవర్‌ను తగ్గించారు. దీంతో చెరో 19 ఓవర్లు మ్యాచ్ ఆడనున్నారు. టీమిండియాలో రిషబ్ పంత్‌కు బదులుగా కేఎల్ రాహుల్‌ను జట్టులోకి తీసుకోగా అటు శ్రీలంక జట్టులో దినేష్ చండీమాల్‌కు బదులుగా సురంగ లక్మల్‌ను ఆడిస్తున్నారు. సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలవ్వగా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఆటగాళ్లు దృఢ నిశ్చయంతో ఉన్నారు. మరోవైపు శ్రీలంక గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు కూడా తమపై వస్తున్న విమర్శలను తట్టుకునేలా ఈ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నది. ఇక జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేష్ రైనా, లోకేష్ రాహుల్, మనీష్ పాండే, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, జయ్‌దేవ్ ఉనడ్కట్, షార్దూల్ ఠాకూర్, యజ్‌వేంద్ర చాహల్.

శ్రీలంక: దనుష్క గుణతిలక, కుశాల్ మెండిస్, కుశాల్ పెరిరా (వికెట్ కీపర్), ఉపుల్ తరంగ, దాసున్ శనక, తిషారా పెరిరా (కెప్టెన్), జీవన్ మెండిస్, అకిల దనంజయ, నువాన్ ప్రదీప్, సురంగ లక్మల్, దుష్మంత చమీరా.

2460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles