విశాఖ వన్డేలో భారత్ ఘనవిజయంSun,December 17, 2017 08:10 PM
విశాఖ వన్డేలో భారత్ ఘనవిజయం

విశాఖపట్నం: విశాఖ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో భారత్ కైవసం చేసుకున్నది. 2 వికెట్ల నష్టానికి భారత్ 219 పరుగులు చేసింది. ఇక..ఈ వన్డేలో శిఖర్ ధావన్ సెంచరీ చేశాడు. వన్డేల్లో 12వ శతకాన్ని ధావన్ సాధించాడు. భారత్ వరుసగా ఎనిమిదో సిరీస్ ను గెలుచుకున్నది. భారత బ్యాట్స్ మెన్లు శ్రేయస్ 65 పరుగులు, కార్తీక్ 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఇక టాస్ గెలిచిన టీమిండియా.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక మొదట బ్యాటింగ్ కు దిగింది. 44.5 ఓవర్లలోనే 10 వికెట్ల నష్టానికి శ్రీలంక 215 పరుగులకు ఆలౌటైంది. ఇక.. సెంచరీ మోత మోగించిన శిఖర్ ధావన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కగా.. 3 వికెట్లు తీసిన కుల్‌దీప్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
3549
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS