భారత జట్టు ఘన విజయం

Sun,March 18, 2018 10:49 PM

India won by 4 wickets

కొలంబో: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత జట్టు సభ్యులు కట్టుదిట్టమైన బోలింగ్‌తో బంగ్లాదేశ్ జట్టును 166 పరుగులకు కట్టడి చేసింది. భారత బౌలర్ల దాటికి కష్టపడ్డ బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎనిమిది వికెట్లు కోల్పోయి భారత జట్టు ముందు 167 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచారు. బంగ్లాదేశ్ ఆటగాడు షబ్బీర్ రహ్మన్ 50 బంతుల్లో 77 పరుగులు చేయగా మిగితా జట్టు సభ్యులు నామమాత్రం స్కోరు కూడా చేయకుండా ఫెవిలియన్ దారి పట్టారు.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి విజయం సాధించింది. 19.5 ఓవర్లో, 162 పరుగుల వద్ద ఒక బాల్‌కు ఐదు పరుగులు చేయాల్సి ఉండగా దినేశ్ కార్తిక్ సిక్స్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మో 56, శిఖర్ ధావన్ 10, సురేశ్ రైనా డకౌట్, కేఎల్ రాహుల్ 24, ఎంకే పాండ్య 28, వీ శంకర్ 17, పరుగులు చేయగా దినేశ్ కార్తిక్ ఎనిమిది బంతుల్లో 29 పరుగులు చేసి జట్టు విజయానికి కారకుడయ్యాడు.

4055
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles