మూడు ఓవర్లు.. ఖేల్‌ఖతం.. టీమిండియా ఘన విజయం

Wed,August 22, 2018 03:48 PM

నాటింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమిండియా. చివరి రోజు 2.5 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 317 పరుగుల దగ్గర చివరి వికెట్ కోల్పోయింది. 9 వికెట్లకు 311 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మరో ఆరు పరుగులు మాత్రమే జోడించగలిగింది. 11 పరుగులు చేసిన ఆండర్సన్.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది కోహ్లి సేన. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5, ఇషాంత్ 2, షమి, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు. బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్‌ను గట్టెక్కించలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లికి ద‌క్కింది. సిరీస్‌లో నాలుగో టెస్ట్ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది.
7533
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles