టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Sat,November 17, 2018 08:16 PM

India Women opt to bat

ప్రావిడెన్స్‌(గ‌యానా): మహిళల టీ20 ప్రపంచకప్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టులో రెండు మార్పులు చేసినట్లు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. అనారోగ్యం కారణంగా సీనియర్ బ్యాటర్ మిథాలీ రాజ్ తుది జట్టు నుంచి తప్పుకోవడంతో అనుజ పాటిల్‌కు ఆడే అవకాశం లభించింది. మాన్షి జోషీ స్థానంలో అరుంధతి టీమ్‌లోకి వచ్చింది.


హ్యాట్రిక్‌ విజయాలతో భార‌త జ‌ట్టు జోరు మీదుంది. ఇప్పటికే సెమీ ఫైనల్‌ బెర్తు ఖరారు చేసుకున్న టీమిండియా గ్రూప్‌-బి ఆఖరి పోరులో బ‌ల‌మైన ఆస్ట్రేలియాతో అస‌లు ప‌రీక్ష‌ను ఎదుర్కోబోతోంది. ఇప్పటివరకు ఇరుజట్లు లీగ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నా.. కీలకమైన నాకౌట్ పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలువాలని రెండు జట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

7119
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS