నేడు శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్

Tue,March 6, 2018 06:50 AM

India vs Sri Lanka Nidahas Trophy 1st T20I

కొలంబో: ఓవైపు బిజీ షెడ్యూల్.. మరోవైపు కీలక ఆటగాళ్లు గాయాలపాలు కాకుండా కాపాడుకోవాలన్న లక్ష్యం.. ఈ రెండింటిని సమన్వయం చేస్తూ భారత్ సరికొత్త ప్రయోగాలకు సిద్ధమైంది. 2019 వరల్డ్‌కప్ సన్నాహకాలకు ఏమాత్రం ఆటంకం కలుగకుండా.. రిజర్వ్ బెంచ్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలనే ఉద్దేశంతో.. ఓ ద్వితీయ శ్రేణి జట్టుతో లంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో కుర్ర టీమ్‌ఇండియా.. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆరుగురు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్.. ఈ సిరీస్‌లో రోహిత్‌కు తాత్కాలికంగా పగ్గాలు అప్పజెప్పింది. ఈ టోర్నీలో బంగ్లాదేశ్ మూడో జట్టుగా బరిలోకి దిగుతున్నది. ఈ సీజన్‌లో స్వదేశం, విదేశంలో కలిపి లంకతో ఆడిన 18 మ్యాచ్ (6 టెస్టులు, 8 వన్డేలు, 4 టీ20)లను టీమ్‌ఇండియా క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో అభిమానులు కూడా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఫలితాన్ని తేలికగా ఊహించేస్తున్నారు. కాబట్టి ఈ పోరు కూడా ఏకపక్షమేనని అందరూ ఊహిస్తున్నారు.

భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రైనా, రాహుల్, మనీష్, రిషబ్ పంత్ / దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ / దీపక్ హుడా, చాహల్, శార్దూల్, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్.

శ్రీలంక: చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా.


3593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles