ధోనీ స‌రికొత్త వ‌ర‌ల్డ్ రికార్డు

Wed,July 10, 2019 12:29 PM

India vs New Zealand, semi-final World Cup 2019: MS Dhoni scripts history with huge World Record

లండ‌న్: భారత మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీ అరుదైన ఘ‌న‌త సాధించాడు. సుధీర్ఘ‌కాలంగా అంత‌ర్జాతీయ క్రికెట్లో కొన‌సాగుతున్న మ‌హీ.. వికెట్‌ కీపర్‌గా ఏకంగా 350 వన్డేలు ఆడిన తొలి క్రికెటర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ఇందులో ధోనీ 3 మ్యాచ్‌ల్లో ఆసియా ఎలెవన్‌కు ప్రాతినిధ్యం వహించగా.. మిగిలిన 347 టీమ్ ఇండియా తరఫున ఆడాడు. ఓవ‌రాల్‌గా 350 వ‌న్డేలాడిన ప‌దో క్రికెట‌ర్‌గా ధోనీ నిలిచాడు. ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మిస్ట‌ర్‌కూల్ ఈ ఘ‌న‌త అందుకున్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్(463) త‌ర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో క్రికెట‌ర్ మ‌హీనే కావ‌డం విశేషం. మొత్తం 350 వ‌న్డేల్లో 200 మ్యాచ్‌ల‌కు ధోనీ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఓవ‌రాల్‌గా రికార్డు స్థాయిలో వ‌న్డేల‌కు సార‌థ్యం వ‌హించిన మూడో క్రికెట‌ర్ ధోనీ కాగా భార‌త్ నుంచి ఏకైక ఆట‌గాడు మ‌హీనే కావ‌డం విశేషం.

శ్రీలంక మాజీ కీపర్‌ సంగక్కర 404 వన్డేలు ఆడినా అందులో 44 మ్యాచ్‌ల్లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా బరిలో దిగాడు. ధోనీ మాత్రం కెరీర్‌ మొత్తం కీపర్‌గానే కనిపించాడు. అత్య‌ధిక వ‌న్డేలాడిన‌ ఈ జాబితాలో సచిన్‌ అగ్రస్థానంలో ఉండగా.. జయవర్ధనే (448), స‌న‌త్ జయసూర్య (445), కుమార సంగక్కర (404), షాహిదీ అఫ్రిది (398), ఇంజమామ్ ఉల్ హ‌క్‌(378), రికీ పాంటింగ్‌ (375), వసీం అక్రమ్‌ (356), ముత్త‌య్య మురళీధరన్‌ (350) ముందున్నారు.

6386
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles