పాక్‌తో మ్యాచ్‌పైనే మా ఫోక‌స్ : రోహిత్ శ‌ర్మ‌

Fri,September 14, 2018 06:32 PM

India to play with Pakistan at Dubai in Asia Cup ODI cricket

దుబాయ్: ఆసియా క‌ప్ వ‌న్డే టోర్న‌మెంట్‌కు ఆయా జ‌ట్లు రెఢీ అవుతున్నాయి. టోర్నీ సంద‌ర్భంగా ఇవాళ ఆరు ఆసియా దేశాల కెప్టెన్లు మీడియాతో మాట్లాడారు. భార‌త్‌, పాక్‌, శ్రీలంక‌, బంగ్లాదేశ్‌, హాంగ్‌కాంగ్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్లు ఈ టోర్నీలో త‌ల‌ప‌డ‌నున్నాయి. సెప్టెంబ‌ర్ 19వ తేదీన పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఆ మ్యాచ్‌పైనే అంద‌రి ఆస‌క్తి ఉంది. ఆ మ్యాచ్‌పై తామంతా ఫోక‌స్ చేసిన‌ట్లు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తెలిపాడు. పాకిస్థాన్‌తో ఆడ‌డం ఎప్పుడూ ఉత్సాహాన్ని క‌లిస్తుంద‌ని అన్నాడు. పాక్ ఇటీవ‌ల మంచి క్రికెట్ ఆడుతోంద‌న్నాడు. ఇవాళ ప్రాక్టీస్ సెష‌న్‌లో భార‌త జ‌ట్టు పాల్గొన్న‌ది. ఆ స‌మ‌యంలో కీప‌ర్ ధోనీతో పాక్ క్రికెట‌ర్ షోయెబ్ మాలిక్ ముచ్చ‌టించాడు. ఆ ఇద్ద‌రూ కాసేపు మాట్లాడుకున్నారు.4443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles