విండీస్‌కు కోహ్లీ సేన‌.. ఆగ‌స్టులో టెస్ట్ చాంపియ‌న్‌షిప్

Thu,June 13, 2019 10:11 AM

India to Begin ICC Test Championship With Two Away Tests Against Windies in August

హైద‌రాబాద్‌: టెస్టు క్రికెట్‌పై ఆస‌క్తిని పెంచేందుకు వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఆ చాంపియ‌న్‌షిప్‌లో త‌న స‌త్తాను భార‌త జ‌ట్టు ఆగ‌స్టులోనే ప‌రీక్షించ‌నున్న‌ది. ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీ ముగియ‌గానే.. కోహ్లీ సేన వెస్టిండీస్ వెళ్తుంది. అక్క‌డ భార‌త జ‌ట్టు ఆ దేశంతో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వ‌న్డేలు ఆడుతుంది. ఆగ‌స్టు 3వ తేదీ నుంచి ఆ టూర్ మొద‌ల‌వుతుంది. అయితే ఇండియా, విండీస్ మ‌ధ్య జ‌రిగే టెస్టు సిరీస్‌తోనే.. ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ప్రారంభంకానున్న‌ది. వ‌చ్చే రెండేళ్ల పాటు వివిధ జ‌ట్ల మ‌ధ్య టెస్ట్ చాంపియ‌న్‌షిప్ జ‌ర‌గ‌నున్న‌ది. భార‌త్‌, విండీస్‌లు మొద‌టి టెస్టును ఆగ‌స్టు 22 నుంచి 26 మ‌ధ్య ఆడుతారు. ఆంటిగ్వాలోని రిచ‌ర్డ్స్ మైదానంలో ఆ మ్యాచ్ ఉంటుంది. ఆ త‌ర్వాత ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కు జ‌మైకాలో రెండ‌వ టెస్ట్ మ్యాచ్ ఉంటుంది. వాస్త‌వానికి విండీస్‌తో సిరీస్‌.. టీ20ల‌తో ప్రారంభంకానున్న‌ది. ఆగ‌స్టు 3, 4వ తేదీల్లో రెండు టీ20లు, ఆ త‌ర్వాత 6వ తేదీన మూడ‌వ మ్యాచ్ ఉంటుంది. ఆగ‌స్టు 8 నుంచి 14 మ‌ధ్య మూడు వ‌న్డేలు ఉంటాయి.

2029
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles