టెస్టు చాంపియ‌న్‌షిప్‌.. ఇండియానే టాప్‌

Tue,October 22, 2019 10:29 AM

హైద‌రాబాద్‌: కోహ్లీసేక ఎవ‌రికీ అంద‌నంత దూరంలో ఉన్న‌ది. టెస్టు మ్యాచ్‌ల్లో టీమిండియా దూసుకువెళ్తున్న‌ది. ప్ర‌స్తుతానికి ప్ర‌పంచ‌ టెస్టు చాంపియ‌న్‌షిప్ పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త జ‌ట్టు టాప్ ప్లేస్‌లో నిలిచింది. 5 మ్యాచ్‌లు ఆడిన ఇండియా 5 విక్ట‌రీల‌తో 240 పాయింట్లు సాధించింది. దీంతో పాయింట్ల టేబుల్‌లో ముందున్న‌ది. భార‌త్‌కు ద‌రిదాపున మ‌రో జ‌ట్టు లేదు. రెండు టెస్టులు ఆడిన న్యూజిలాండ్‌, శ్రీలంక జ‌ట్లు.. 60 పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో నిలిచాయి. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జ‌ట్లు అయిదు టెస్టు మ్యాచ్‌లు ఆడినా.. ఆ రెండు జ‌ట్లు కేవ‌లం రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే నెగ్గాయి. రెండింట్లో ఓడాయి. ఒక‌టి డ్రా చేసుకున్నాయి. దీంతో ఆసీస్‌, ఇంగ్లండ్ జ‌ట్లు పాయింట్ల ప‌ట్టిక‌లో 56 పాయింట్ల‌తో నాలుగు, అయిదు స్థానాల్లో నిలిచాయి. వెస్టిండీస్‌, సౌతాఫ్రికా ఇంకా ఖాతా తెర‌వ‌లేదు. ఇక బంగ్లాదేశ్‌, పాక్ మాత్రం టెస్టు చాంపియ‌న్‌షిప్ మ్యాచ్‌ల‌ను మొద‌లు పెట్టాల్సి ఉన్న‌ది. ఇటీవ‌ల భార‌త్‌.. హోమ్ సిరీస్‌ల్లో దుమ్మురేపుతోంది. గ‌త ఏడేళ్ల నుంచి స్వ‌దేశంలో ఇండియ‌న్ ప‌ర్ఫార్మెన్స్ సూప‌ర్‌గా ఉంది. సౌతాఫ్రికాపై క్లీన్‌స్వీప్‌తో హోమ్ సిరీస్‌ను వ‌రుస‌గా గెల‌వ‌డం ఇది 11వ సారి. 2012-13లో చివ‌రిసారి.. ఇంగ్లండ్ చేతిలో టీమిండియా హోమ్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఆ త‌ర్వాత భార‌త్‌కు ఎదురులేకుండా పోయింది.2417
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles