1999 వరల్డ్‌కప్‌లో గెలిచాం.. ఇప్పుడు పోరాడకుండానే లొంగిపోతారా?

Fri,February 22, 2019 11:19 AM

India should play and win the match against Pakistan in the World Cup feels Shashi Tharoor

న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడాలా వద్దా అన్నదానిపై చర్చ కొనసాగుతూనే ఉన్నది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మాజీ క్రికెటర్లలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు పాక్‌తో క్రికెటే వద్దని అజర్, హర్భజన్‌లాంటి క్రికెటర్లు అంటే.. అలా చేయడం వల్ల మనకే నష్టమని గవాస్కర్, చేతన్ చౌహన్‌లాంటి వాళ్లు అంటున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత శశి థరూర్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఆడకపోవడం వల్ల రెండు పాయింట్లు కోల్పోవడమే కాదు.. ఇది లొంగిపోవడం కంటే దారుణమని, పోరాడకుండానే ఓటమి అంగీకరించినట్లు అవుతుందని థరూర్ అభిప్రాయపడ్డారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనూ వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఇండియా ఆడి గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన వేరే చర్యల స్థానంలో క్రికెట్‌ను బలి చేయకూడదని థరూర్ స్పష్టం చేశారు.


3080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles