రాంచీలోనూ ర‌ఫాడించారు.. స‌ఫారీల‌పై క్లీన్‌స్వీప్‌

Tue,October 22, 2019 10:03 AM

హైద‌రాబాద్: టెస్టుల్లో టీమిండియా హ‌వా న‌డుస్తోంది. ద‌క్షిణాఫ్రికాతో రాంచీలో జ‌రిగిన టెస్టులో ఇన్నింగ్స్ 202 ర‌న్స్ తేడాతో భార‌త్ విజ‌యం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను కోహ్లీ సేన క్లీన్ స్వీప్ చేసింది. గెలుపుకు కావాల్సిన రెండు వికెట్ల‌ను.. కొత్త బౌల‌ర్ న‌దీమ్ ఇవాళ త‌న ఖాతాలో వేసుకున్నాడు. నాలుగవ రోజున లోకల్ స్పిన్న‌ర్‌ న‌దీమ్‌.. ఆట ఆరంభ‌మైన రెండ‌వ ఓవ‌ర్‌లోనే రెండు వికెట్లను తీశాడు. సౌతాఫ్రికా త‌న రెండో ఇన్నింగ్స్‌లో 133 ర‌న్స్ చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 162 ప‌రుగుల‌కు ఆలౌటైన సౌతాఫ్రికా .. ఫాలోఆన్ కూడా స‌రిగా ఆడ‌లేక‌పోయింది. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 497 ర‌న్స్ చేసిన విష‌యం తెలిసిందే.ఇటీవ‌ల భార‌త్‌.. హోమ్ సిరీస్‌ల్లో దుమ్మురేపుతోంది. గ‌త ఏడేళ్ల నుంచి స్వ‌దేశంలో ఇండియ‌న్ ప‌ర్ఫార్మెన్స్ సూప‌ర్‌గా ఉంది. హోమ్ సిరీస్‌ను వ‌రుస‌గా గెల‌వ‌డం ఇది 11వ సారి కావ‌డం విశేషం. 2012-13లో చివ‌రిసారి.. ఇంగ్లండ్ చేతిలో టీమిండియా హోమ్ టెస్ట్ సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఆ త‌ర్వాత భార‌త్‌కు ఎదురులేకుండా పోయింది.సిరీస్ క్వీన్‌స్వీప్ కావ‌డంతో.. టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో భార‌త్ ముందు వ‌రుస‌లో నిలిచింది. అయిదు మ్యాచ్‌ల‌ను ఆడిన ఇండియా.. అన్నింట్లోనూ విక్ట‌రీ న‌మోదు చేసింది. అయితే రాంచీ మ్యాచ్‌లో భార‌త్ భారీ తేడాతో నెగ్గ‌డం.. కోహ్లీసేన‌కు క‌లిసి వ‌చ్చే అంశ‌మే. ఎన్నో ఏళ్లు టీమిండియాలో చోటు కోసం ప్ర‌య‌త్నించిన స్పిన్న‌ర్ న‌దీమ్‌కు ఈ మ్యాచ్‌తో జ‌ట్టులో స్థానం ద‌క్కింది. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో సుమారు 400 వికెట్లు తీసిన స్పిన్న‌ర్ న‌దీమ్‌.. ఈమ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి త‌న అంత‌ర్జాతీయ ఖాతా తెరిచాడు.

2184
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles