పాక్‌ను మట్టికరిపించిన భారత్‌

Fri,June 22, 2018 11:02 PM

India Put On Masterclass In Tournament Opener, Thrash Pakistan 36-20

దుబాయ్: కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో పోరులో భారత్ ఘన విజయం సాధించింది. అన్ని రంగాల్లో బలంగా ఉన్న అజయ్ ఠాకూర్ సారథ్యంలోని భారత్ 36-20 తేడాతో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. తొలి సెషన్ ముగిసేసరికి భారత్ 22-9 పాయింట్లతో ముందంజలో నిలిచింది. రెండో సెషన్‌లో భారత ఆటగాళ్లు తమ దూకుడు కొనసాగించారు. మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ ఆధిక్యంలో నిలవడంతో టోర్నీలో తొలి విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది.

మ్యాచ్ ఆద్యంతం భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా గొప్పగా రాణించింది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాక్‌, కెన్యాలతో కలిసి భారత్‌ గ్రూప్‌- ఎలో ఉంది. గ్రూప్‌- బిలో ఇరాన్‌, కొరియా, అర్జెంటీనా జట్లు ఉన్నాయి.స్టార్‌ ఇండియాతో కలిసి అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య (ఐకేఎఫ్‌) ఈ టోర్నీని నిర్వహిస్తోంది.

2562
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles