పాక్‌తో ఆడాలా వ‌ద్దా.. క‌పిల్‌దేవ్ ఏమ‌న్నాడంటే

Sat,February 23, 2019 09:45 AM

India-Pakistan World Cup match, Kapil Dev says leave it to central government

హైద‌రాబాద్: ఇండియా, పాకిస్థాన్ మ‌ధ్య క్రికెట్ మ్యాచ్‌లు ఉండాలా వ‌ద్దా అన్న అంశంపై .. మాజీ ఫాస్ట్ బౌల‌ర్ క‌పిల్‌దేవ్ స్పందించాడు. వ‌చ్చే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో రెండు దేశాలు త‌ల‌ప‌డాలా వ‌ద్దా అన్న అంశాన్ని కేంద్రానికే వ‌దిలేయాల‌న్నారు. పుల్వామా దాడి ఘ‌ట‌న త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ్డాయి. పాక్‌తో ఆడ‌కుంటే మంచిద‌ని కొంద‌రు సీనియ‌ర్లు, ఆడ‌కుంటే పాయింట్ల‌ను కోల్పోతామ‌ని మ‌రికొంద‌రు సీనియ‌ర్లు అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇండియాకు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన మాజీ కెప్టెన్ క‌పిల్‌దేవ్ కూడా ఈ అంశంపై మాట్లాడారు. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో పాక్‌తో ఇండియా ఆడాలా వ‌ద్దా అన్న అంశాన్ని కేంద్ర ప్ర‌భుత్వం చూసుకుంటుంద‌ని, ప్ర‌భుత్వమే దేశ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. ఇండోపాక్ ఫైట్ గురించి మ‌నలాంటి వాళ్లు నిర్ణ‌యించాల్సిన‌ అవ‌స‌రం లేద‌ని, ఈ అంశంపై ప్ర‌భుత్వం ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని, మ‌న అభిప్రాయాల‌ను మ‌రొక‌రిపై రుద్ద‌డం స‌రికాదు అని క‌పిల్ అన్నాడు.

2448
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles