ఈ రోజు మ‌ధ్యాహ్నం భార‌త్‌-కివీస్ సెమీస్ మ్యాచ్

Wed,July 10, 2019 12:01 PM

india , Newzealand  semies continuess today

లండన్: మాంచెస్టర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జర‌గాల్సిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ నిన్న వ‌ర్షం కార‌ణంగా వాయిదా ప‌డ్డ‌ సంగ‌తి తెలిసిందే. ఏ దశలోనూ ఆటను కొనసాగించ‌డానికి వీలు లేని నేప‌థ్యంలో ఆట‌ను అంపైర్లు నేటికి వాయిదా వేశారు . నేడు రిజ‌ర్వ్ డే కావ‌డంతో మిగ‌తా ఆట‌ని కొన‌సాగించ‌నున్నారు. నిన్న జ‌రిగిన మ్యాచ్‌లో వర్షం కురిసే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసింది. దీంతో నేటి మ్యాచ్‌ను ఇక్క‌డ నుండి కొనసాగిస్తారు. ఈ క్రమంలో కివీస్ మరో 3.5 ఓవర్లు ఆడనుంది. ఆ తరువాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా 50 ఓవర్ల పాటు కొనసాగుతుంది. అయితే నేడు కూడా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి లేకపోతే అప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నందున టీమిండియానే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది..!

5016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles