ధోనీ 'ప్రశాంతత' భారత్‌కు అవసరం..!

Tue,March 12, 2019 10:56 AM

India need Dhonis calmness in World Cup

మొహాలి: భారత్ జట్టులో నాలుగో స్థానంపై మళ్లీ చర్చమొదలైంది. వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే కీలక ఆటగాడి కోసం టీమిండియా మూడేళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసింది. ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా ఆ స్థానంలో నిలకడగా రాణించకపోవడంతో భారత్ మళ్లీ ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనల్లో పడింది. ఇప్పుడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్ కోసం మళ్లీ వేట కొనసాగిస్తోంది. ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఆ స్థానంలో బరిలో దించే ప్రయత్నం చేయాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు.

స్ట్రైక్‌ రొటేట్ చేయడంతో పాటు అలవోకగా సిక్స్‌లు బాదే సామర్థ్యం కలిగిన విజయ్‌ను నాలుగో నంబర్‌లో ఆడిస్తే బాగుంటుందనేది నా ఆలోచన. బ్యాట్స్‌మన్‌గానే అతన్ని ఆడించాలి. ఒక బౌలర్‌గా అతనికి 3 ఓవర్ల బౌలింగ్ ఇస్తే చాలు. ఏడు లేదా పూర్తి కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేయించడం అవసరం లేదు. నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా అంబటి రాయుడిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. వెల్లింగ్టన్‌లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 90 పరుగుల తర్వాత.. అతడు ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరిగ్గా సరిపోతాడని..తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడని భావించా. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం..శంకర్ రాణిస్తుండటంతో ప్రస్తుతం జట్టులో రాయుడు స్థానం ప్రశ్నార్థకంగా మారింది. విరాట్ కోహ్లీ కచ్చితంగా మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాలి. ఈ జట్టులో విన్నింగ్ కల్చర్‌ను నెలకొల్పే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపడం సరికాదని మంజ్రేకర్ అన్నారు.

2011లో కంటే ప్రస్తుత బౌలింగ్ దళం అద్భుతంగా ఉంది. ప్రపంచంలో అత్యుత్త జట్టు భారత్ అయినప్పటికీ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్‌లో గెలుస్తారని మాత్రం చెప్పలేమని మంజ్రేకర్ అన్నారు. మహేంద్రసింగ్ ధోనీ అనుభవం జట్టుకు ఎంతో అవసరం. అతని అసమాన్య వికెట్ కీపింగ్ నైపుణ్యంపై ఎలాంటి ప్రశ్నే లేదు. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో ఉంది. ప్రపంచకప్‌లో ధోనీ ప్రశాంతత భారత్‌కు అవసరం ఉందని సంజయ్ పేర్కొన్నారు.

2213
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles