విండీస్‌తో రెండో వన్డేలో తలపడే భారత జట్టిదే!

Tue,October 23, 2018 05:00 PM

India name unchanged 12-man squad for 2nd ODI against West Indies

వైజాగ్: ఐదు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేలో అద్భుత విజయం సాధించిన టీమిండియా మరో విజయంపై కన్నేసింది. ప్రత్యర్థి జట్టు 300కు పైగా లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ ఆతిథ్య బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్శ(152*), విరాట్ కోహ్లీ (140) భారీ శతకాలతో రాణించడంతో 8వికెట్ల తేడాతో గెలుపొందింది. బుధవారం ఇరు జట్ల మధ్య విశాఖపట్నంలో రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ 12 సభ్యుల జట్టును మంగళవారమే ప్రకటించింది. జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా తొలి వన్డేకు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లే వైజాగ్ వన్డేలో ఆడతారని తెలిపింది. తొలి వన్డేలో అవకాశం వచ్చిన ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేయడంతో జట్టు కూర్పులో మార్పులు చేయకూడదని నిర్ణయించింది. విన్నింగ్ కాంబినేషన్‌ను తర్వాతి వన్డేలకు కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. తుది జట్టును భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ సమయంలో వెల్లడించనున్నాడు. 5వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.5005
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles