50 ఓవర్లలో భారత్ 336/5..

Sun,June 16, 2019 07:37 PM

India made 336 runs for 5 wickets against pakisthan in world cup match

లండన్: పాకిస్థాన్‌తో మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆటకు కొంతసేపు అంతరాయం ఏర్పడినప్పటికీ ఎలాంటి ఓవర్ల కోత లేకుండానే తిరిగి ఆటను ప్రారంభించారు. కాగా భారత బ్యాట్స్‌మెన్లలో ఓపెనర్ రోహిత్ శర్మ 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 140 పరుగులు చేసి చక్కని ప్రదర్శన కనబరిచాడు. అలాగే కెప్టెన్ కోహ్లి (77 పరుగులు, 7 ఫోర్లు), మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (57 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా రాణించారు. దీంతో భారత్ భారీ స్కోరు చేసింది. కాగా పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్‌కు 3 వికెట్లు దక్కగా, హసన్ అలీ, వహబ్ రియాజ్‌లకు చెరొక వికెట్ దక్కింది.

అంపైర్ ఔటివ్వకున్నా...


భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లి అంపైర్ ఔటివ్వకున్నా తాను ఔటయ్యాననుకుని వెనుదిరగడం చర్చనీయాంశమైంది. 48 ఓవర్ 4 బంతిని అమీర్ షార్ట్ పిచ్ లెంగ్త్‌లో వేయగా కోహ్లి ఆ బాల్‌ను పుల్ చేసేందుకు యత్నించాడు. దీంతో బంతి కోహ్లి హెల్మెట్‌కు తగిలి వెనక్కి వెళ్లింది. సర్ఫరాజ్ క్యాచ్ పట్టాడు. అయితే నిజానికి అల్ట్రా ఎడ్జ్‌లో బంతి ఎక్కడా బ్యాట్‌కు తగిలినట్లు కనిపించలేదు. కానీ అంపైర్ ఔటివ్వకున్నా కోహ్లి తాను ఔటయ్యానని భావించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లి నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

4170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles