రివ్యూ కోల్పోయిన భారత్.. తొలి వికెట్ కోల్పోయిన కివీస్..

Tue,July 9, 2019 03:21 PM

india lost review and kiwis lost its fist wicket in world cup 2019 semifinal

లండన్: మాంచెస్టర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ తొలి ఓవర్‌లోనే తన రివ్యూ కోల్పోయింది. భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్ మొదటి బంతిని న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ గప్తిల్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడాడు. దీంతో బాల్ అతని ప్యాడ్లకు తగిలింది. అంపైర్ నాఔట్ ఇచ్చాడు. అయితే అది ఔట్ కావచ్చని భారత్ రివ్యూ కోరగా.. డీఆర్‌ఎస్‌లో అది నాటౌట్ అని తేలింది. దీంతో భారత్ తన ఒక్క రివ్యూను కోల్పోయింది.

అయితే బుమ్రా వేసిన 4వ ఓవర్ 3వ బంతికి మార్టిన్ గప్తిల్ ఔట్ అయ్యాడు. స్లిప్‌లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన గప్తిల్ 14 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే తీశాడు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్‌లు ఉండగా.. కివీస్ 3.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి కేవలం 1 పరుగు వద్దే కొనసాగుతోంది.

3598
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles