50/0 నుంచి 59/3.. కష్టాల్లో టీమిండియా

Thu,August 2, 2018 05:11 PM

India lost 2 wickets in Sam Curran over

ఎడ్‌బాస్టన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఇంగ్లండ్‌ను 287 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు మంచి ఆరంభాన్నిచ్చారు. విజయ్, ధావన్ తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అయితే 20 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర శామ్ కురన్ బౌలింగ్‌లో విజయ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కేఎల్ రాహుల్ తొలి బంతికే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించినా.. తర్వాత బంతికే బౌల్డయ్యాడు. దూరంగా వెళ్తున్న బంతిని వికెట్ల మీదికి లాక్కొని వికెట్ పారేసుకున్నాడు రాహుల్. దీంతో ఒకే ఓవర్లో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. కురన్ తన తర్వాతి ఓవర్లో శిఖర్ ధావన్‌ను కూడా ఔట్ చేశాడు. దీంతో 50 పరుగులకు వికెట్ కోల్పోకుండా పటిష్ఠ స్థితిలో ఉన్న టీమిండియా.. 59 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో పడింది.

3137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS