రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ ఔట్‌..

Wed,July 10, 2019 03:55 PM

India loses top wickets against New Zealand in first Semifinal

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. టాప్ ఆర్డ‌ర్‌లో రోహిత్‌, విరాట్, రాహుల్‌ వికెట్ల‌ను కోల్పోయింది. అయిదు ప‌రుగుల‌కే ఇండియా మూడు కీల‌క వికెట్ల‌ను చేజార్చుకున్న‌ది. స్పీడ్ బౌల‌ర్ల‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కివీస్ బౌల‌ర్లు చెల‌రేగుతున్నారు. 240 ర‌న్స్ టార్గెట్‌తో బ్యాటింగ్ మొద‌లుపెట్టిన‌ ఇండియా.. న‌త్త‌న‌డ‌క‌న బ్యాటింగ్ చేస్తున్న‌ది. ముగ్గురు మేటి బ్యాట్స్‌మెన్‌ వికెట్లు కోల్పోయిన భార‌త్ మాంచెస్ట‌ర్‌లో ఎదురీదుతున్న‌ది. కివీస్ బౌల‌ర్లు చెల‌రేగుతున్న తీరు.. ఇండియాకు నిరాశ సంకేతాలే అందిస్తున్నాయి. ఇక ఇప్పుడు వ‌రుణుడు కూడా ఇండియాను కాపాడ‌లేడేమో. సెమీస్‌లో ఇండియా ముందు టార్గెట్ ఎవ‌రెస్టులా త‌యారైంది. మ‌రో కొన్ని గంట‌లు టెన్ష‌న్ క్రికెట్ త‌ప్పేట‌ట్టు లేదు.

802
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles