కూల్‌గా ఆడుతున్న‌ రోహిత్, ధోనీ

Sat,January 12, 2019 01:37 PM

India loses early wickets at Sydney ODI, Rohit and Dhoni looks solid at grease

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో భార‌త్ నెమ్మ‌దిగా టార్గెట్ దిశ‌లో వెళ్తోంది. 289 ర‌న్స్ ల‌క్ష్యంతో చేజింగ్ స్టార్ట్ చేసిన భార‌త్‌కు ఆసీస్ పేస‌ర్లు ఆరంభంలోనే భారీ షాక్ ఇచ్చారు. కేవ‌లం నాలుగు ప‌రుగుల‌కే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అయితే ఆ త‌ర్వాత ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ‌, మాజీ కెప్టెన్ ధోనీ మ‌రో వికెట్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇద్ద‌రూ నిదానంగా ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 21 ఓవ‌ర్లు ముగిసే వ‌ర‌కు భార‌త్ మూడు వికెట్ల న‌ష్టానికి 73 ర‌న్స్ చేసింది. రోహిత్ 40, ధోనీ 25 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు. ధావ‌న్‌, రాయుడులు డ‌కౌట్ కాగా, కోహ్లీ మూడు ర‌న్స్ చేసి క్యాచ్ ఔట‌య్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో చేజింగ్ మొద‌లు పెట్టిన భార‌త్‌.. ఫ‌స్ట్ 15 ఓవ‌ర్ల‌లో ఒక్క ఫోర్ కూడా కొట్ట‌లేదు. కానీ ఆ ఓవ‌ర్ల‌లో మాత్రం మూడు సిక్స‌ర్ల‌ను బాదింది.

3186
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles