కోహ్లీ లేకుండానే..విండీస్‌ ఎలెవన్‌తో వార్మప్‌ మ్యాచ్‌!

Sat,August 17, 2019 05:03 PM

India likely to rest injured Virat Kohli for warm-up game against West Indies Cricket Board XI

అంటిగ్వా: వెస్టిండీస్‌పై టీ20, వన్డే సిరీస్‌లు నెగ్గిన టీమ్‌ఇండియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సమరానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో విండీస్ క్రికెట్ బోర్డు ఎలెవెన్‌తో శనివారం నుంచి మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్ ఆడనుంది. భారత జట్టులోకి వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సహా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార, స్పీడ్‌స్టర్ బుమ్రా, వికెట్ కీపర్ సాహా రానున్నారు. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో స్వల్పంగా గాయపడ్డ(కుడి చేతి బొటన వేలికి) కెప్టెన్ కోహ్లీ ఈ సన్నాహక మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే సారథ్య బాధ్యతలను రహానే నిర్వర్తించనున్నాడు. ఆరు నెలల కిందట సౌరాష్ట్ర తరఫున ఆడిన రంజీ ఫైనల్ పుజారాకు చివరి మ్యాచ్. మరోవైపు ఇంగ్లిష్ కౌంటీల్లో అంతగా ఆకట్టుకోని రహానే కరీబియన్ గడ్డపై సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు.


ఇక టీ20, వన్డేల్లో పెద్దగా ఆకట్టుకోని పంత్ గాడిలో పడాలని ఆశిస్తున్నాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక పేస్ బౌలర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, స్పిన్నర్ అశ్విన్ కూడా జట్టుతో కలవనున్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, విండీస్ మధ్య ఈనెల 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌ను కూడా టీమ్‌ఇండియా చేజిక్కించుకుంటే.. ఒకే పర్యటనలో విండీస్ గడ్డపై మూడు ఫార్మాట్ల సిరీస్‌లను తొలిసారి గెలుచుకున్న రికార్డును విరాట్‌సేన సృష్టిస్తుంది.

1119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles