టీమిండియా 179 ఆలౌట్‌

Sat,May 25, 2019 05:29 PM

India in Trouble, Lose Eight Wickets

లండన్‌:ఇంగ్లాండ్‌ పర్యటనను ఘనంగా ఆరంభించాలని ఆశించిన భారత్‌కు నిరాశే ఎదురైంది. వామప్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఐసీసీ వరల్డ్‌ కప్‌ నేపథ్యంలో శనివారం న్యూజిలాండ్‌తో తొలి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనే బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌ బాట పట్టారు. కివీస్‌ బౌలర్ల ధాటికి భారత్‌ టపటపా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జ‌డేజా(54) ఒక్క‌డే అర్ధ‌శ‌త‌కంతో రాణించాడు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(2), శిఖర్‌ ధావన్‌(2) ఆరంభంలోనే ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(18), లోకేశ్‌ రాహుల్‌(6), హార్దిక్‌ పాండ్య(30), మహేంద్రసింగ్‌ ధోనీ(17), దినేశ్‌ కార్తీక్‌(4), భువనేశ్వర్‌ కుమార్‌(1), కుల్దీప్‌ యాదవ్‌(19), షమీ(2 నాటౌట్‌) స్వల్ప స్కోర్లకే ఔటై నిరాశపరిచారు. టీమిండియా 39.2 ఓవర్లలో 179 పరుగులు చేసి ఆలౌటైంది. ట్రెంట్ బౌల్ట్ 4, జేమ్స్ నీష‌మ్‌ 3 వికెట్లు తీసి భార‌త్‌ను కుప్ప‌కూల్చారు.

కివీస్‌ బౌలర్లు పిచ్‌ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకొని చెలరేగిపోతున్నారు. కళ్లచెదిరే బంతులతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా పరుగులు చేయకుండా ఒత్తిడి పెంచి ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. పేపర్‌పై బలంగా కనిపిస్తున్న భారత్‌ మైదానంలో చేతులెత్తేసింది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 8 వికెట్లకు 130 పరుగులు చేసింది. ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అయినప్పటికీ నిర్ణీత ఓవర్ల కన్నా ముందే భారత జట్టు ఆలౌటైంది

5356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles