టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ

Sun,October 21, 2018 01:16 PM

India have won the toss and have opted to field

గువహాటి: ఆతిథ్య భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిలకడగా రాణిస్తున్న అంబటి రాయుడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని విరాట్ చెప్పాడు. ఇక టెస్టుల్లో సత్తాచాటిన యువ ఆటగాడు రిషబ్ పంత్ స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ముగ్గురు పేసర్లు, మణికట్టు స్పిన్నర్ చాహల్‌తో పాటు ఆల్‌రౌండర్ జడేజాను టీమ్‌లోకి తీసుకున్నట్లు కోహ్లీ వివరించాడు.

విండీస్‌లో ఇద్దరు అరంగేట్రం..

కరీబియన్ జట్టులోకి ఇద్దరు ఆటగాళ్లు అరంగేట్రం చేస్తున్నట్లు ఆ టీమ్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తెలిపాడు. హేమ్‌రాజ్ ఓపెనర్‌గా బరిలో దిగనుండగా.. ఒషానే థామస్ ఫాస్ట్ బౌలర్‌గా టీమ్‌లోకి వచ్చాడని పేర్కొన్నాడు.2206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS