జయహో భారత్‌..ఫ్యాన్స్ సందడి..మ్యాచ్ విశేషాలు

Sun,June 16, 2019 04:24 PM

India flags fluttering in the breeze as theyre hung over the sides of the stands by the fans

మాంచెస్టర్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. టీమిండియా బ్యాట్స్‌మెన్ పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. క్రీజులో కుదురుకున్న హిట్‌మ్యాన్ మైదానం నలువైపులా భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. రోహిత్, రాహుల్ భారత్‌కు అదిరే ఆరంభం అందించడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ఓపెనర్లు మంచి రన్‌రేట్‌తో భారీ స్కోరుకు బాటలు వేశారు. దీంతో మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారితో పాటు ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న వారు తెగ సంబరపడిపోతున్నారు. ముఖ్యంగా స్టేడియంలో ఉన్న సగానికి పైగా అభిమానులు టీమిండియాకే మద్దతు తెలుపడం విశేషం. కొంతమంది సోషల్ మీడియా వేదికగా తమ అభిమానాన్ని చాటుతున్నారు.భార‌త జాతీయ జెండాల‌తో మైదానం నిండిపోయింది.


3001
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles