టీమిండియాకు హోట‌ల్ లేదు!

Mon,January 16, 2017 03:44 PM

India, England teams to stay in Pune till Wednesday due to lack of Hotel rooms in Cuttack

క‌ట‌క్‌: ఇంగ్లండ్‌తో తొలి వ‌న్డే ముగిసినా.. బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు టీమిండియా ప్లేయ‌ర్స్ పుణెలో ఉండ‌నున్నారు. రెండో వ‌న్డే జ‌ర‌గాల్సిన క‌ట‌క్‌లో ప్లేయ‌ర్స్‌కు స‌రిప‌డా హోట‌ల్ గ‌దులు లేక‌పోవ‌డంతో ఆ మ్యాచ్ కోసం పుణెలోనే ఉండి ప్రాక్టీస్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. భార‌త్‌తోపాటు ఇంగ్లండ్ టీమ్‌కూ ఈ తిప్ప‌లు త‌ప్ప‌లేదు. క‌ట‌క్‌లో టీమ్స్ ఉండాల్సిన హోట‌ల్‌లో ఇప్ప‌టికే రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయి. మ్యాచ్ జ‌రిగే గురువారం ఉద‌యం వ‌ర‌కు అవి ఖాళీ అయ్యే అవకాశం లేదు. దీంతో టీమ్స్ పుణెలోనే ఉండాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఒడిశా క్రికెట్ అసోసియేష‌న్ సెక్ర‌ట‌రీ ఆశీర్వాద్ బెహెరా చెప్పారు. టీమ్స్ బుధ‌వారం ఉద‌యం 11.30కు వ‌స్తాయి. సాయంత్రం 4 గంట‌ల నుంచి ప్లేయ‌ర్స్ ప్రాక్టీస్ చేస్తారు. బుధ‌వారం ఉద‌యం నుంచి రూమ్స్ అందుబాటులో ఉంటాయి అని బెహెరా తెలిపారు.

సోమ‌వారం బ్రేక్ తీసుకోనున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌.. మంగ‌ళ‌వారం పుణెలోని ప్రాక్టీస్ చేస్తార‌ని టీమ్ మేనేజ్‌మెంట్ స‌భ్యుడు ఒక‌రు వెల్ల‌డించారు. మిగ‌తా ఏర్పాట్ల‌న్నీ స‌రిగానే ఉన్నాయ‌ని, హోట‌ల్‌రూమ్స్ విష‌యానికి వ‌స్తే అవి అందుబాటులో ఉంటేనే తాము బుక్ చేయ‌గ‌ల‌మ‌ని బెహెరా చెప్పారు. పుణె మ్యాచ్ స‌క్సెస్ కావ‌డంతో క‌ట‌క్ మ్యాచ్‌పై అంచ‌నాలు భారీగా ఉన్నాయ‌ని, ఇప్ప‌టికే మ్యాచ్ టికెట్ల‌న్నీ అమ్ముడైపోయాయ‌ని బెహెరా తెలిపారు.

3094
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles