ఆర్మీ క్యాప్‌తో కోహ్లీసేన‌.. రాంచీ వ‌న్డేలో ఫీల్డింగ్ ఎంచుకున్న‌ భార‌త్‌

Fri,March 8, 2019 01:13 PM

India elects to bowl first in Ranchi ODI against Australia

హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాతో ఇవాళ రాంచీ వేదికగా మూడ‌వ వ‌న్డే జ‌ర‌గ‌నున్న‌ది. ధోనీ హోమ్‌టౌన్‌లో కోహ్లీ సేన మ‌రోసారి త‌న స‌త్తా చాట‌నున్న‌ది. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. ఇప్ప‌టికే 5 వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. మ్యాచ్ ప్రారంభం కావ‌డానికి ముందు.. టీమిండియా ప్లేయ‌ర్లు కొత్త క్యాప్‌ను ధ‌రించారు. పుల్వామా ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా మిలిట‌రీ రంగు టోపీల‌ను ధ‌రించ‌నున్నారు. నేష‌న‌ల్ డిఫెన్స్ ఫండ్‌కు విరాళాలు ఇవ్వాల‌న్న సందేశాన్ని కూడా ప్లేయ‌ర్లు ఇచ్చారు. అమ‌ర జ‌వాన్ల పిల్ల‌ల చ‌ద‌వు కోసం ఆ నిధుల‌ను వాడ‌నున్నారు. మాజీ కెప్టెన్ ధోనీ.. ప్లేయ‌ర్ల‌కు కొత్త క్యాప్‌ను అందించారు.2642
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles