ఇండియా బౌలింగ్‌ అద్భుతం.. కానీ స్పిన్నర్స్‌..!

Tue,December 3, 2019 07:47 PM

హైదరాబాద్‌: ఇండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ అద్భుతంగా ఉందనీ, కానీ ఆస్ట్రేలియాలో వారి స్పిన్‌ విభాగం బాగా స్ట్రగుల్‌ అవుతోందని ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా బౌలింగ్‌తో పోలిస్తే ఇండియా బౌలింగ్‌ దళం అంతగా ఆకట్టుకోదని ఆయన తెలిపారు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పిచ్‌లపైనైనా రాణించగలరని పాంటింగ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇండియా ఫాస్ట్‌ బౌలింగ్‌ విభాగం అద్భుతంగా రాణిస్తుందన్న పాంటింగ్‌.. జస్ప్రీత్‌ బుమ్రా, మహమద్‌ షమీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారన్నారు. వారికి తోడు.. అనుభవజ్ఞులైన ఇషాంత్‌ శర్మ, ఉమేష్‌ యాదవ్‌ ఉన్నారని పేర్కొన్నారు. స్వదేశంలో సీనియర్‌ స్పిన్నర్స్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా కూడా అద్భుతంగా రాణించగలరని పాంటింగ్‌ అన్నారు.


కానీ, ఆస్ట్రేలియాలో భారత స్పిన్నర్లు తడబడతారని పాంటింగ్‌ అన్నాడు. ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌తో పోలిస్తే.. భారత స్పిన్నర్ల సగటు ఆసీస్‌లో చాలా తేడా ఉందన్నారు. ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ స్టార్క్‌కు తోడుగా లియాన్‌ అద్భుతాలు చేస్తాడని తన అభిప్రాయం వ్యక్తం చేశారు పాంటింగ్‌. ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన డే/నైట్‌ టెస్టు సిరీస్‌ను ఆసీస్‌ 2-0తో వైట్‌వాష్‌ చేసిన విషయం తెలిసిందే.

1531
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles