పెర్త్ టెస్ట్: భారత్ 283 ఆలౌట్

Sun,December 16, 2018 11:40 AM

India bowled out for 283 runs against Australia

పెర్త్: ఆస్ట్రేలియా ప్రధాన స్పిన్నర్ నాథన్ లైయన్(5/67) దెబ్బకు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 105.5 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 43 పరుగులు ఆధిక్యం ల‌భించింది. 172/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన‌ టీమిండియా 111 పరుగులు రాబ‌ట్టింది. విరాట్ కోహ్లీ(123: 257 బంతుల్లో 13ఫోర్లు, సిక్స్), రహానె(51) రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఓపెనర్లు విఫలమైనా.. మిడిలార్డర్ అద్భుతంగా పోరాడింది. మధ్యలో హనుమ విహారి(20) కోహ్లీకి సహకరించాడు. ఆఖర్లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్(36: 50 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించాడు. టీ20 తరహాలో అతడు బ్యాటింగ్ చేశాడు. పేస్‌కు సహకరిస్తున్న పిచ్‌పై పేసర్లతో పాటు ఏకైక స్పిన్నర్ లైయన్ గొప్పగా బౌలింగ్ చేశారు.

మూడో రోజు, ఆదివారం ఆట తొలిసెషన్‌లోనే రహానెను వెనక్కి పంపి ఆసీస్ పైచేయి సాధించింది. ఆ తర్వాత విరాట్ ఒక్కడే లంచ్ బ్రేక్ వరకు ఒంటరి పోరాటం చేశాడు. లంచ్ బ్రేక్‌కు ముందు పాట్ కమిన్స్ వేసిన 93వ ఓవర్లో కోహ్లీ వెనుదిరిగాడు. విరాట్ ఔటైన తర్వాత భారత్ చకచకా వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్(2/79), హేజిల్‌వుడ్(2/66) భారత బ్యాట్స్‌మెన్ స్వేచ్ఛగా పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చిన టెయిలెండర్లు షమీ(0), ఇషాంత్ శర్మ(1), బుమ్రా(4), ఉమేశ్ యాదవ్(4 నాటౌట్)లు స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

2886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles