భారత్, కివీస్ సెమీస్ మ్యాచ్ మరుసటి రోజు కంటిన్యూ

Tue,July 9, 2019 11:00 PM

india and newzealand semi final match will continue tomorrow

లండన్: మంగళవారం మాంచెస్టర్‌లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేశారు. వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడడంతో ఆట ఆగిపోయింది. దీంతో ఇక ఏ దశలోనూ.. కనీసం ఓవర్లను కుదించి అయినా ఆటను కొనసాగించేందుకు వీలు కాలేదు. ఈ క్రమంలో అంపైర్లు రిజర్వ్ డే అయిన మరుసటి రోజు (బుధవారం)తిరిగి యథాతథంగా మ్యాచ్‌ను కొనసాగించనున్నారు.

కాగా మ్యాచ్‌లో వర్షం కురిసే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 211 పరుగులు చేసింది. దీంతో బుధవారం ఇక్కడి నుంచే మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఈ క్రమంలో కివీస్ మరో 3.5 ఓవర్లు ఆడనుంది. ఆ తరువాత భారత ఇన్నింగ్స్ పూర్తిగా 50 ఓవర్ల పాటు కొనసాగుతుంది. అయితే బుధవారం కూడా వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఒకవేళ కూడా మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితి లేకపోతే అప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నందున టీమిండియానే నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది..!

2940
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles