ఇండియా, ఆస్ట్రేలియా చెరో రెండు విజయాలు, కానీ ఇండియానే నెం.1

Mon,September 9, 2019 12:33 PM

India and Australia Chero are two wins, but India is No. 1

న్యూఢిల్లీ: ఐసీసీ(ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) నిర్వహిస్తున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకూ ఇండియా, ఆస్ట్రేలియా చెరో రెండు విజయాలతో సమానంగా ఉన్నప్పటికీ, ఇండియానే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎందుకంటారా..! ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తలపడుతున్న యాషెస్ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆసీస్ రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒక డ్రాతో నిలిచింది. అదే సమయంలో ఇండియా వెస్టిండీస్‌తో ఆడిన రెండు టెస్టుల సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ చేసింది.

ఐసీసీ నిబంధనల మేరకు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక్కో విజయానికి 60 పాయింట్లు కేటాయిస్తారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఒక్కో విజయానికి 24 పాయింట్లు కేటాయిస్తారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 2 మ్యాచ్‌లూ గెలిచిన ఇండియా(60+60) తో 120 పాయింట్లు సాధించింది. ఆసీస్ మాత్రం రెండు విజయాలు, ఓ డ్రాతో(24+24+8) 56 పాయింట్లు సాధించింది. కావున ఈ సమీకరణాల దృష్ట్యా ప్రస్తుతం ఇండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ వన్ స్థానంలో ఉంది.1512
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles