పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ స‌ల‌హా ప‌ట్టించుకోని స‌ర్ఫ‌రాజ్‌

Sun,June 16, 2019 03:08 PM

Imran Khan tweets to select batting if wins toss

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ టాస్ గెలిస్తే.. ముందుగా బ్యాటింగ్ చేయాల‌ని ఆ దేశ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు. కానీ స‌ర్ఫ‌రాజ్ మాత్రం దానికి భిన్నంగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే మైండ్ గేమ్‌. ఈ మాట అన్న‌ది కూడా ఇమ్రానే. లెజెండ్ క్రికెట‌ర్ అయిన ఇమ్రాన్ అభిప్రాయాల్ని పాక్ టీమ్ ప‌క్క‌న పెట్టిందా. పాకిస్థాన్‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ సూచ‌న‌ల‌ను ఆ జ‌ట్టు ఎందుకు పాటించ‌లేదో. ఇదో మైండ్ గేమ్ అనుకోవాలా. ఓడిపోతామ‌న్న భ‌యాన్ని మెద‌డు నుంచి తీసేస్తే.. విజ‌యం వ‌రిస్తుంద‌ని ఇమ్రాన్ త‌న ట్వీట్‌లో చెప్పారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సంద‌ర్భంగా.. ఇమ్రాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఈ హై టెన్ష‌న్ మ్యాచ్‌పై అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. ఇవాళ మాంచెస్ట‌ర్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. నిజానికి ఫ‌స్ట్ బౌలింగ్ జ‌ట్టుకే ఎక్కువ విజ‌యావ‌కాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్క‌డ కొన్ని రోజులుగా కురుస్తున్న వ‌ర్షం వ‌ల్ల పిచ్ ముద్ద‌గా త‌యారైంది. టాస్ విష‌యంలో స‌ర్ఫ‌రాజ్ త‌ప్పు చేశాడేమో.. కానీ ఇమ్రాన్ మాత్రం ఇండియానే ఫెవ‌రేట్ అన్న ట్వీట్‌ను కూడా చేశారు.





5782
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles