ఇమామ్, హఫీజ్ ఔట్.. కష్టాల్లో పాక్

Wed,June 12, 2019 09:04 PM

Imam-Ul-Haq Falls After Fifty, Pakistan Three Down

టాంటన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన పాక్ 2 పరుగులకే వికెట్ చేజార్చుకుంది. ఓపెనర్ ఫకార్ జమాన్ డకౌట్ కాగా.. బాబర్ అజామ్(30) కొంతసేపు పోరాడాడు. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి దూకుడుగా ఆడిన ఇమామ్ హుల్ హక్(53) హాఫ్‌సెంచరీ పూర్తి చేశాడు. ఐతే పాట్ కమిన్స్ వేసిన 26వ ఓవర్ మొదటి బంతికే కీపర్ కేరీకి క్యాచ్ ఇచ్చి ఇమామ్ వెనుదిరగడంతో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. ఆసీస్ సారథి అరోన్ ఫించ్ బౌలింగ్‌లో కుదురుకున్న హఫీజ్(46) ఔటవడంతో పాకిస్థాన్ కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ అహ్మద్, షోయబ్ మాలిక్ క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి ఇంకా 162 పరుగులు చేయాల్సి ఉంది.

1721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles