ధోనీ లేని క్రికెట్‌ను ఊహించగలమా..?: ఐసీసీ

Mon,February 11, 2019 02:47 PM

Imagine Cricket without Dhoni tweets ICC

దుబాయ్: టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది. ఈ మధ్య ఐసీసీ చేసే ట్వీట్లలో ధోనీ తరచూ కనిపిస్తున్నాడు. మొన్నటికి మొన్న ధోనీ వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి అంటూ ప్రత్యర్థులను హెచ్చరించిన ఐసీసీ.. తాజాగా అతనిపై మరో ట్వీట్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ ధోనీకి 300వది. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ ప్లేయర్ అతడు. అందుకు తగినట్లే ఈ మ్యాచ్‌లో అతడు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. బ్యాట్‌తో విఫలమైనా.. ఓ మెరుపు స్టంపింగ్‌తో తన మార్క్ చూపించాడు. ఇక ఓ అభిమాని వచ్చి తన కాళ్లపై పడితే.. ముందు అతడి చేతిలోని జాతీయ పతాకం నేలపై పడకుండా పట్టుకున్నాడు. ఇక మ్యాచ్ తర్వాత ఐసీసీ ట్వీట్లతో అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. వరల్డ్ ఫేమస్ బ్యాండ్ బీటిల్స్ కో ఫౌండర్, సింగర్ జాన్ లెనన్ పాడిన ఇమాజిన్ పాటను గుర్తు చేస్తూ ఐసీసీ వరుసగా ట్వీట్లు చేస్తూ వెళ్లింది. అంపైర్ లేని క్రికెట్‌ను ఊహించండి.. అన్ని మ్యాచ్‌లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి అంటూ ట్వీట్లు చేస్తూ వెళ్లింది. ఇందులో ధోనీని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ధోనీ లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది.. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరూ ఉండరు. మీతో పరిహాసాలు ఆడటానికీ ఎవరూ ఉండరు అంటూ ఐసీసీ ట్వీట్ చేసింది. ఇది ధోనీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది.

7332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles