ధోనీ మళ్లీ అలా చేస్తే పెనాల్టీయే!

Thu,October 5, 2017 06:26 PM

ICCs new Fake Fielding Law may land MS Dhoni in Trouble

దుబాయ్: వికెట్ల వెనుక విలక్షణంగా ఉండే తీరు ధోనీని ప్రత్యేకంగా నిలబెట్టింది. బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించడానికి అతను అప్పుడప్పుడూ బంతి చేతిలో లేకపోయినా.. స్టంప్స్‌ను గిరాటేసినట్లుగా నటిస్తుంటాడు. క్రికెట్ పండితులు ధోనీ తెలివిని మెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక నుంచి ఇలా చేస్తే మాత్రం ధోనీ చిక్కుల్లో పడతాడు. ఐసీసీ కొత్తగా ప్రవేశపెట్టిన నిబంధనల ప్రకారం ఇది ఫేక్ ఫీల్డింగ్ కిందికి వస్తుంది. బంతి అందుకోకపోయినా.. అందుకున్నట్లు చేసి బ్యాట్స్‌మన్‌ను మోసం చేయడం సరికాదని ఈ కొత్త నిబంధన చెబుతున్నది. దీని కింద బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు. సెప్టెంబర్ 28 నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. 24 గంటల్లోనే ఆస్ట్రేలియా డొమెస్టిక్ టోర్నీ జేఎల్టీ వన్డేకప్‌లో మార్నస్ లాబషేన్ అనే ప్లేయర్ ఇలా చేసినందుకు అంపైర్ ఐదు పరుగుల పెనాల్టీ విధించాడు. ఇదీ ఆ వీడియో.అది ఫీల్డర్ కావాలనే ఇలా చేశాడా, ఇది మోసం కిందికి వస్తుందా అన్నది పూర్తిగా అంపైర్ విచక్షణ కిందికే వస్తుంది. అయితే ఈ కొత్త నిబంధనను టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రంగా తప్పుబట్టాడు. బుధవారం వరుస ట్వీట్లలో ఐసీసీని ఉతికి ఆరేశాడు మంజ్రేకర్. ఈ మధ్య కాలంలో ఐసీసీ తెచ్చిన చెత్త నిబంధన ఇదేనంటూ అతను అన్నాడు. మరి ఇది తప్పే కదా అని ప్రశ్నించిన అభిమానులకు సమాధానమిస్తూ.. అదొక ట్రిక్ అవుతుందే తప్ప మోసం ఎలా అవుతుంది అని ప్రశ్నించాడు.


6245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles