World Cup: ఓవైపు గాయాలు.. మరోవైపు వర్షాలు

Tue,June 11, 2019 04:14 PM

ICC World Cup 2019  List of players nursing injuries

లండన్: వన్డే ప్రపంచకప్‌ను ఆస్వాదించాలని కోట్లాది మంది క్రికెట్ ప్రేమికులు ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా కొంతమంది స్టార్ ప్లేయర్స్ నిష్క్రమణ, వర్షాలు మ్యాచ్‌లకు ఆటంకం కలిగిస్తుండటంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆట రద్దు కావడంతో సెమీస్ అవకాశాలు దెబ్బతినే ఛాన్స్ ఆయా దేశాలు ఉందని ఆందోళన చెందుతున్నాయి. ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమ్‌లు అంచనాలకు తగ్గట్టుగా రాణించకపోవడంతో విశ్వసమరం చప్పగా సాగుతోంది. ఒకటి రెండు మ్యాచ్‌లు మినహా ఏ ఒక్క మ్యాచ్ కూడా హోరాహోరీగా, రసవత్తరంగా సాగలేదు. చాలా వరకు మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగాయి. అభిమానుల్లో ఆదరణ కలిగిన ఆటగాళ్లు టోర్నీకి దూరం కావడం ఒకింత ఆందోళన కల్గిస్తోంది. టోర్నీ ఆరంభంలోనే ఇలా ఉంటే.. వ‌చ్చే నెల 14 వ‌ర‌కు జ‌రిగే మ్యాచ్‌లతో ఇంకెంత మంది ఇంటిముఖం ప‌డ‌తారో!


గాయపడిన ఆటగాళ్లు వీరే..


టీమిండియా ఎక్స్‌ప్లోజివ్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఆస్ట్రేలియాతో పోరులో బొటనవేలికి గాయం కావడంతో మూడు వారాలపాటు టోర్నీకి దూరమయ్యాడు. అద్వితీయ ఫామ్‌లో ఉన్న గబ్బర్ లేనిలోటు మిగతా మ్యాచ్‌ల్లో ప్రభావం చూపనుంది. వరల్డ్ స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వైదొలిగాడు. గాయంతోనే టోర్నీలో అడుగుపెట్టిన స్టెయిన్ భారత్‌తో మ్యాచ్‌కు ముందు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సౌతాఫ్రికాకు చెందిన మరో పేసర్ అన్రిచ్ నోర్టీ కూడా బొటనవేలికి ఫ్రాక్చర్ కావడంతో టోర్నీకి కొద్దిరోజుల ముందు నిష్క్రమించడంతో అతని స్థానంలో క్రిస్‌మోరీస్‌కు అవకాశం కల్పించారు. శ్రీలంక తరఫున మెరుగైన ప్రదర్శన చేస్తున్న పేసర్ నువాన్ ప్రదీప్ బౌలింగ్ వేసే చేతి వేలికి గాయంతో ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోనున్నాడు. బంగ్లాతో మ్యాచ్‌కు అందుబాటులో లేడు.


అఫ్గనిస్థాన్ సంచలనం మహ్మద్ షెజాద్‌కు మోకాలి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పిస్తున్నట్లు ఆదేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఐతే తాను ఫిట్‌గా ఉన్నప్పటికీ అనవసరంగా తప్పించారని బోర్డుపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ సామ్ బిల్లింగ్స్ భుజం నొప్పితో సొంతగడ్డపై జరుగుతున్న మెగా టోర్నీకి దురదృష్టవశాత్తు దూరమయ్యాడు. జే రిచర్డ్‌సన్ ఆస్ట్రేలియా 15 మంది ఆటగాళ్ల జాబితాలో చోటుదక్కింది. పేసర్ కూడా భుజం గాయంతోనే వైదొలగడంతో కేన్ రిచర్డ్‌సన్‌ను ఎంపిక ఎంపిక చేసింది ఆసీస్‌.4706
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles