Telangana Intermediate 1st & 2nd Year Results 2019

ఇది ఔటా.. నాటౌటా.. మీరే చెప్పండి!

Mon,March 25, 2019 03:46 PM

ICC tweets a photo of Gully Cricket and asks fans to decide it out or not out

దుబాయ్: పైనున్న ఫొటో చూశారు కదా.. మిడిల్ స్టంప్ కింద పడిపోయింది. కానీ పైనున్న బెయిల్స్ చెక్కు చెదరలేదు. మరి క్రికెట్ నిబంధనల ప్రకారం ఇది ఔటా.. నాటౌటా.. అసలు క్రికెట్ నిబంధనలను రూపొందించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిలే (ఐసీసీ) సాధారణ అభిమానులను ఈ ప్రశ్న అడగటం విశేషం. పాకిస్థాన్‌లో గల్లీ క్రికెట్ ఆడుతున్న కొందరు పిల్లలు ఈ ఫొటోను నేరుగా ఐసీసీకి ట్వీట్ చేశారు. మీరే న్యాయం చెప్పాలంటూ అడిగారు. సరే.. అన్ని రూల్స్ తెలిసిన ఐసీసీయే ఇది ఔటో నాటౌటో చెప్పేయొచ్చు. కానీ సరదాగా ఇదే ఫొటోను ట్వీట్ చేస్తూ ఔటా కాదా చెప్పండి అని ఐసీసీ అడిగింది.


దీనికి చాలా మంది అభిమానులు నాటౌట్ అనే రిైప్లె ఇచ్చారు. ఎందుకంటే రూల్స్ ప్రకారం బెయిల్స్ కింద పడాలి కదా. మిడిల్ స్టంప్ కింద పడినా.. పైనున్న బెయిల్ చెక్కు చెదరలేదు కాబట్టి.. ఇది నాటౌటే అని తేల్చారు. కానీ ఐసీసీ మాత్రం దీనిని ఔట్ అని తేల్చింది. ఐసీసీ రూల్ బుక్‌లోని 29.1.1 ప్రకారం ఇది ఔట్. ఎందుకంటే ఈ నిబంధన ప్రకారం బెయిల్ కింద పడాలి లేదా స్టంప్ పూర్తిగా నేలకొరగాలి. అలా జరిగితే బ్యాట్స్‌మన్ ఔటే. ఈ నిబంధనను చెబుతూ సదరు బ్యాట్స్‌మన్ ఔటే అని తేల్చింది. మొత్తానికి గల్లీ క్రికెట్ అయినా కూడా ఈ ఫొటో కారణంగా అభిమానులకు ఓ కొత్త నిబంధన తెలిసి వచ్చింది.

2504
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles