ఫీల్డ్ బయట ఎలా ఉండాలంటే.. క్రికెటర్లకు ఐసీసీ పాఠాలు

Sun,October 21, 2018 01:25 PM

ICC to educate cricketers on off field Behaviour in the wake of me too movement

సింగపూర్: ఇప్పుడు ప్రపంచమంతా మీ టూ ఉద్యమం గురించే మాట్లాడుకుంటున్నది. సినీ ఇండస్ట్రీలనే కాదు రాజకీయాలను కూడా ఈ లైంగిక వేధింపుల ఆరోపణల పర్వం కుదిపేస్తున్నది. దీంతో క్రికెటర్లు అలాంటి ఆరోపణల సుడిలో చిక్కుకోకుండా ఉండటానికి ఐసీసీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా ఫీల్డ్ బయట ఎలా ఉండాలన్నదానిపై కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. సింగపూర్‌లో జరిగిన మూడు రోజుల ఐసీసీ బోర్డు సమావేశాల్లో ఈ మీ టూ కూడా చర్చకు వచ్చింది. లైంగిక వేధింపులను నిరోధించడానికి ఓ కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్లేయర్స్, సపోర్టింగ్ స్టాఫ్, ఐసీసీ ఈవెంట్‌లలో పని చేసే ప్రతి సభ్యుడు, స్థానిక ఆర్గనైజింగ్ కమిటీలోని సభ్యులు ఫీల్డ్ బయట ఎలా వ్యవహరించాలో ఐసీసీ వివరించింది. అన్ని విధాలుగా క్రికెట్‌ను ఓ మంచి రక్షణ కలిగిన ప్రదేశంగా మార్చాలన్నదే తమ ప్రయత్నమని ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు.

ఈ కొత్త విధానంలో భాగంగా లైంగిక వేధింపులకు గురి కాకుండా రక్షణ కల్పించడంతోపాటు అసభ్యకర ప్రవర్తన, టోర్నీలోని స్టాఫ్‌తో అనుచితంగా ప్రవర్తించడంలాంటి చర్యలను నిరోధించడానికి కొన్ని నిబంధనలను ఐసీసీ రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా జూనియర్ స్థాయిలోనూ ఈవెంట్లు జరుగుతుండటంతో పిల్లలపై లైంగిక వేధింపులను అడ్డుకోవడాన్ని కూడా ఇందులో చేర్చారు. ఈ విధానం వచ్చిన తర్వాత దానిని ప్రతి సభ్య దేశం అమలు చేయాలని ఐసీసీ స్పష్టంచేసింది. మీటూ ఉద్యమంలో భాగంగా ఎంతోమంది క్రీడాకారులపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినా.. క్రికెటర్లపై మాత్రం ఇప్పటివరకు అలాంటి ఆరోపణలు రాలేదు. అయితే ఈ మధ్యే బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రిపై ఈ ఆరోపణలు రావడం సంచలనం రేపింది. దీనిపై సీఓఏ ఇప్పటికే ఆయన వివరణ కోరడంతో దీర్ఘకాలిక సెలవుపై పంపించింది.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles