అదో చెత్త రూల్‌.. క‌ప్ ఇద్ద‌రికీ ఇవ్వాలి

Mon,July 15, 2019 12:54 PM

ICC rule is ridiculous, tweets Gautam Gambhir

హైద‌రాబాద్‌: ఎవ‌రు ఎక్కువ బౌండ‌రీలు కొడితే వాళ్లదే క‌ప్‌. ఇదేం రూల్‌ ? ఈ నిబంధ‌న స‌రిగా లేద‌న్న వాద‌న వినిపిస్తున్న‌ది. జెంటిల్మెన్ గేమ్‌లో.. ఇలాంటి చెత్త రూల్ ఎంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. లార్డ్స్‌లో ఆదివారం ర‌స‌వ‌త్త‌రంగా జ‌రిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఇంగ్లండ్ ట్రోఫీని ఎగురేసుకుపోయింది. అయితే మ్యాచ్ టై అయినా.. ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ కూడా టైగానే ముగిసింది. ఇక ఐసీసీ రూల్స్ ప్రకారం.. బౌండ‌రీల ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు. ఫైన‌ల్లో ఇంగ్లండ్ మొత్తం 26 బండ‌రీలు కొట్టింది.. కివీస్ మ‌త్రం 17 బౌండ‌రీలే బాదింది. అయితే నువ్వా నేనా అన్న‌ట్టుగా సాగిన మ్యాచ్‌లో.. ముగింపు అదిరింది. కానీ ఫైన‌ల్ మ్యాచ్‌ను ఎవ‌రు ఎన్ని బౌండ‌రీలు కొట్టిన ఆధారంగా డిసైడ్ ఎలా చేస్తార‌ని మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఇదో చెత్త రూల్ అంటూ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేశాడు. థ్రిల్లింగ్ ఫైన‌ల్ ఆడిన రెండు జ‌ట్లకు కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు గంభీర్ ట్వీట్ చేశాడు. ఇద్ద‌రూ విన్న‌ర్లే అన్న సంకేతాన్నిచ్చాడు. ఫ‌స్ట్ ఓవ‌ర్‌త్రో, ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్‌లో టై అయినా.. కివీస్‌నే దుర‌దృష్టం వెంటాడింది. క్రికెట్‌లో ఉన్న కొన్ని రూల్స్‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రోహిత్ శ‌ర్మ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. ఇంగ్లండ్ వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచింది.. కానీ న్యూజిలాండ్ మ‌న‌సును గెలిచింద‌ని ట‌ర్బ‌నేట‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ ప్ర‌ద‌ర్శించిన పోరాట స్పూర్తిని మ‌రువ‌లేమ‌ని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

6073
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles